గత వారం రోజుల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు విల విలలాడిపోతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రోడ్లపై ప్రజలు లేక నిర్మాణుశ్యంగా మారిపోతున్నాయి.
హైదరాబాద్- తెలుగు రాష్ట్రాల్లో వానలు జోరుగా కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు జన జీవనం అస్తవ్యస్థమైంది. ఎక్కడికక్కడ వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను ఆదివారం రాత్రి తీరం దాటి వాయుగుండంగా బలహీనపడటంతో ప్రస్తుతం మహారాష్ట్రలోని విదర్భ, చత్తీస్గడ్, తెలంగాణ సమీపంలో ఇది కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను […]