హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. స్రీట్ నంబర్ 5లో రోడ్డు పది అడుగుల మేర గొయ్యి పడింది. అప్పుడే అటుగా ఇసుక లోడ్ తో వెళ్తున్నమినీ ట్రక్ అందులో కూరుకుపోయింది. రోడ్డు ఒక్కసారిగా ఓ వైపుకు ఒరుగుతుండటంతో వాహన దారులు, స్థానికులు ఆందోళన చెందారు. రోడ్డు మీద గొయ్యి పడి, వాహనం అందులో కూరుకుపోవడంతో రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందిగా మారింది. కాగా, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు. […]