ఈ మద్య చాలా మంది చిన్న చిన్న కారణాలతో డిప్రేషన్ లోకి వెళ్లడం.. ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చూస్తున్నాం. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ ఇంటర్నేషనల్ మహిళా షూటర్ ఖుష్ సీరత్ కౌర్ సందు (17) ఆత్మహత్య చేసుకుంది. ఎంతో అద్భుతమైన భవిష్యత్ ఉన్న యువ క్రీడాకారిణి ఆత్మహత్యకు పాల్పడటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. గురువారం (డిసెంబర్ 9) ఉదయం ఫరీద్‌కోట్‌లోని తన ఇంట్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. […]