కరీంనగర్ జిల్లా చినముల్కనూరు శివారులోని ఓ వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. బావిలో పూర్తిగా కారు మునిగిపోయింది. బావిలో నుంచి కారును తీసేందుకు 9 గంటలుగా చర్యలు సాగించారు అధికారులు. ఉదయం 11 గంటలకు ఓవర్ స్పీడ్తో దూసుకొచ్చి రాంగ్రూట్లో వెళ్లి వ్యవసాయ బావిలో పడింది కారు. హన్మకొండ జిల్లా సూర్యానాయక్ తండా ఎస్ఐ పాపయ్యనాయక్ రెండేళ్ల క్రితం రిటైరై కరీంనగర్లో స్థిరపడ్డారు. ముల్కనూర్ వైపు వెళ్తుండగా ఆయన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బావిలో పడింది. […]