పంచినా కొద్ది తరిగేది ధనం అయితే, పంచినా కొద్ది పెరిగేది విద్య. విద్య ద్వారనే వ్యక్తులు ఉన్నతమైన విలువలతో జీవితంలో ఉన్నత శిఖారలను అధిరోహిస్తారు. అయితే విద్యార్థులకు ఆయా వర్సిటీలు గ్రాడ్యుయోషన్ డే నిర్వహించి డిగ్రీ పట్టాలను ప్రధానం చేస్తారు. అయితే ఆ డిగ్రీ పట్టాల వేడుక కార్యక్రమంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ శునకం డిగ్రీ పట్టాను అందుకుని అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది.