పంచినా కొద్ది తరిగేది ధనం అయితే, పంచినా కొద్ది పెరిగేది విద్య. విద్య ద్వారనే వ్యక్తులు ఉన్నతమైన విలువలతో జీవితంలో ఉన్నత శిఖారలను అధిరోహిస్తారు. అయితే విద్యార్థులకు ఆయా వర్సిటీలు గ్రాడ్యుయోషన్ డే నిర్వహించి డిగ్రీ పట్టాలను ప్రధానం చేస్తారు. అయితే ఆ డిగ్రీ పట్టాల వేడుక కార్యక్రమంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ శునకం డిగ్రీ పట్టాను అందుకుని అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది.

యూఎస్ఎ లోని న్యూజెర్సీలో సెటాన్ హాల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయోషన్ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందించే కార్యక్రమంలో ఓ విద్యార్థిని తో పాటు విశ్వాసానికి మారుపేరైన ఓ శునకం కూడా వేదికపైకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళ్తే.. సెటాన్ వర్సిటీలో మారియానీ అనే విద్యార్థిని బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చదువుతోంది. ఆమె దివ్యాంగురాలు దీంతో ఆమె వీల్ చైర్ లో ఉండే తన దిన చర్యలను చేసుకుంటుంది. ఆమెకు తోడుగా జస్టిస్ అనే శునకం ఉంటుంది.
అయితే తాజాగా ఆ వర్సిటీలో డిగ్రీ పట్టాల ప్రధానోత్సవం జరిగింది. అయితే మారియానీ కూడా డిగ్రీ పట్టా అందుకోవాల్సి ఉంది. దీనికోసం ఆమె వీల్ చైర్ లో వస్తూ తన శునకాన్ని కూడా తీసుకు వచ్చింది. మారియానీ డిగ్రీ పట్టా అందుకునే సమయంలో వర్సీటీ ఇంచార్జి ఆ శునకానికి డిగ్రీ పట్టా అందించారు. ఆ శునకం నోటితో ఆ డిగ్రీ పట్టాను అందుకుంది. దీంతో అక్కడ ఉన్న విద్యార్థులు కేరింతలు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సెటాన్ హాల్ యూనివర్సిటీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
Seton Hall President Joseph E. Nyre, Ph.D. presents Justin, the service dog for Grace Mariani, of Mahwah, NJ, with a diploma for attending all of Grace’s classes at Seton Hall. pic.twitter.com/sZgHD5Fs3X
— Seton Hall (@SetonHall) May 23, 2023