ఇండియన్ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. సాహో, రాధేశ్యామ్ సినిమాలతో దేశవ్యాప్తంగా సాలిడ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. సినిమాల ఫలితాలను పక్కనపెట్టి భారీ బడ్జెట్ సినిమాలను లైనప్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆదిపురుష్. […]