ఇండియన్ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. సాహో, రాధేశ్యామ్ సినిమాలతో దేశవ్యాప్తంగా సాలిడ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. సినిమాల ఫలితాలను పక్కనపెట్టి భారీ బడ్జెట్ సినిమాలను లైనప్ చేసుకుంటున్నాడు.
ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నాడు. ప్రభాస్ కెరీర్ లో రాబోతున్న మొదటి పౌరాణిక చిత్రమిది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.ఇటీవలే షూటింగ్ పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి 12న ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. అయితే.. తాజాగా ఆదిపురుష్ కి సంబంధించి క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. దేశంలోనే మోషన్ కాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న సినిమాగా ఆదిపురుష్ అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం హాలీవుడ్ అవతార్ చిత్రానికి ఉపయోగించిన విఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని సమాచారం.
విదేశాలకు చెందిన 50 మంది సాంకేతిక నిపుణుల టీమ్ కూడా ఆదిపురుష్ కోసం పనిచేస్తున్నారట. దాదాపు ఆదిపురుష్ క్లైమాక్స్ కోసమే 60 కోట్లు ఖర్చు చేశారట. మరి అవతార్ టెక్నీషియన్స్ ఆదిపురుష్ కి వర్క్ చేస్తున్నారంటే.. హాలీవుడ్ ని మించే స్థాయిలో విజువల్స్ ఉండబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. రామాయణం నేపథ్యంలో ఇదివరకు వచ్చిన సినిమాలకి మించి ఆదిపురుష్ ఉండనుందట. ఇక ఈ సినిమాలో సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త, రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. మరి ఈ సినిమాలో కొత్త ప్రభాస్ ని చూడబోతున్నట్లు ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.ఇదిలా ఉండగా.. ప్రభాస్ చేతిలో ఆదిపురుష్ తో పాటు సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలు ఉన్నాయి. సలార్ సినిమాను కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా.. ప్రాజెక్ట్ కే సినిమాను నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయనున్నాడు. మరి ఆదిపురుష్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.