Nalgonda: నల్గొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల మండలంలోని ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. చిట్యాల మండలం, వెలిమినేడులోని హిందీస్ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఆ సమయంలో లోపల విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలటంతో పెద్ద శబ్ధం వచ్చింది. ఆ శబ్ధం కారణంగా బయట ఉన్న జనం భయపడిపోయారు. ఏం జరుగుతోందో తెలియక పరుగులు తీశారు. ఫ్యాక్టరీనుంచి మంటలు […]