Nalgonda: నల్గొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల మండలంలోని ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. చిట్యాల మండలం, వెలిమినేడులోని హిందీస్ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఆ సమయంలో లోపల విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలటంతో పెద్ద శబ్ధం వచ్చింది. ఆ శబ్ధం కారణంగా బయట ఉన్న జనం భయపడిపోయారు. ఏం జరుగుతోందో తెలియక పరుగులు తీశారు.
ఫ్యాక్టరీనుంచి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో పాటు పొగ కమ్మేసింది. ఆ వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ కంపెనీ రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధి రెడ్డికి చెందినదిగా తెలుస్తోంది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పుస్తకాలు, పరీక్షలు లేకుండానే పాస్.. నకిలీ సర్టిఫికేట్లతో విదేశాలకు పంపుతూ!