తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోవడం లేదని ఎన్నో ప్రేమజంటలు ఆత్మహత్యకు పాల్పపడిన సంఘటనలు వెలుగు చూశాయి. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని మనస్థాపానికి గురై చిన్నవయసులోనే తనువు చాలిస్తున్నారు. కన్నవారికి గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.
కరోనా వైరస్ పుణ్యమా అంటూ ప్రజలకు కొత్తగా పరిచయమైన లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ఒక అంశాన్ని తీసుకుని పూర్తిగా అవగాహన కల్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ‘పూరి మ్యూజింగ్స్‘ అనే పేరుతో విభిన్న అంశాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు. మనకున్న జీవన నైపుణ్యాలని తెలుసుకోవడం కోసం మనకి మనమే ఓ అగ్నిపరీక్ష పెట్టుకొని ఒంటరిగా బయలుదేరి వెళ్లి అడవిలో ఒక్కడివే బతకడం […]