చదువులో రాణించాలంటే కష్టపడి చదవాలి.. కానీ కొంతమంది విద్యార్థులు ఏమాత్రం కష్టపడకుండా పరీక్ష కేంద్రంలో రకరకాల పద్దతుల్లో కాపీయింగ్ కి పాల్పపడుతూ ఉంటున్నారు. కొన్నిసార్లు ఎగ్జామ్ హాల్ లో స్క్యాడ్స్ కి అడ్డంగా బుక్ అయి డిబార్ అవుతూ మంచి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు.
సాధారణంగా ఎక్కువ మంది విద్యార్థులకు పరీక్షలు వచ్చాయంటే భయపడిపోతుంటారు. పరీక్షల దగ్గర పడే కొద్ది పుస్తకాలకు పురుగులా విద్యార్థులు మారిపోతుంటారు. కానీ కొందరు విద్యార్థులు మాత్రం కాపీ కొట్టి పాస్ అవ్వొచ్చులే అని ధీమాగా ఉంటారు. అలానే అనేక విధాలుగా చీటీలు రాసుకుని పరీక్ష హాల్ లోకి తీసుకెళ్తారు. నేటికాలంలో కొందరు అయితే పరీక్షల్లో కాపీ కొట్టేందుకు టెక్నాలజీ కూడా వాడుకుంటున్నారు. తాజాగా ఓ స్టూడెంట్ కాపీ కొట్టిన విధానం చూసి.. స్క్వాడ్ అధికారులు సైతం షాకయ్యారు. […]