సాధారణంగా ఎక్కువ మంది విద్యార్థులకు పరీక్షలు వచ్చాయంటే భయపడిపోతుంటారు. పరీక్షల దగ్గర పడే కొద్ది పుస్తకాలకు పురుగులా విద్యార్థులు మారిపోతుంటారు. కానీ కొందరు విద్యార్థులు మాత్రం కాపీ కొట్టి పాస్ అవ్వొచ్చులే అని ధీమాగా ఉంటారు. అలానే అనేక విధాలుగా చీటీలు రాసుకుని పరీక్ష హాల్ లోకి తీసుకెళ్తారు. నేటికాలంలో కొందరు అయితే పరీక్షల్లో కాపీ కొట్టేందుకు టెక్నాలజీ కూడా వాడుకుంటున్నారు. తాజాగా ఓ స్టూడెంట్ కాపీ కొట్టిన విధానం చూసి.. స్క్వాడ్ అధికారులు సైతం షాకయ్యారు. పదో తరగతి పరీక్షల్లో ఓ విద్యార్థి ప్యాడ్ పై ఫోన్ ను అమర్చుకుని.. వాట్సాప్ ద్వారా కాపీ కొడుతూ దొరికిపోయాడు. ఈఘటన హర్యాణాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..ఇటీవల హర్యాణాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అందరు విద్యార్థురుల పరీక్షలు హాజరవుతున్నారు. అయితే ఓ విద్యార్థి పరీక్షల్లో పాసైయ్యేందుకు కాపీ కొట్టాలని నిర్ణయచుకున్నాడు. దీంతో ఎగ్జామ్ ప్యాడ్ గా గ్లాస్ క్లిప్ బోర్డును తెచ్చుకున్నాడు. ఆ క్లిప్ బోర్డులో రహస్యంగా స్మార్ట్ ఫోన్ ను అమర్చాడు. ఆ ఫోన్ లోని వాట్సాప్ ద్వారా దర్జాగా కాపీ కొట్టాడు. ఆ ఫోన్ ఎవరి కంటపడకుండా ఆన్సర్ పేపర్లను అడ్డుపెట్టుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఎగ్జామ్ స్క్వాడ్ ఈ హైటెక్ కాపీయింగ్ ని గుర్తించారు. ఆ విద్యార్థి వద్ద నుంచి క్లిప్ బోర్డ్‌ను, మొబైల్ ఫోన్‌ను అన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. కేసు కూడా నమోదు చేశారు.ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
One of the examinees got a smartphone fitted in the clipboard for cheating in exam at an examination centre in Fatehabad district of #Haryana in the Board examination being conducted by the Board of School Education. The flying squad detected use of unfair means. @thetribunechd pic.twitter.com/aCXejWV1Sa
— Deepender Deswal (@deependerdeswal) April 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.