బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ విమాన తయారీ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. అక్కడి ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాల గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వివరించారు. హెచ్‌ఏఎల్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల గురించి వెంకయ్యనాయుడు మాట్లాడారు. దేశీయ వైమానిక పరిశ్రమ అభివృద్ధిలో హెచ్ఏఎల్‌ది కీలక పాత్రని వెంకయ్యనాయుడు అన్నారు. సంఘటిత, పర్యావరణహిత అభివృద్ధి అజెండాగా వెళ్లాలని వెంకయ్యనాయుడు సూచించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ఏరోస్పేస్, డిఫెన్స్ పవర్‌హౌస్‌గా దూసుకెళ్లడంలో దేశీయ ఉత్పత్తులు […]