ఈసారి ఆస్కార్ వేడుకల్లో భారతదేశం సత్తా చాటింది. ఏకంగా రెండు పురస్కారాలతో హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే ఆస్కార్ సాధించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నిర్మాత మాత్రం అవార్డు కమిటీ మీద సంచలన ఆరోపణలు చేశారు.
95వ ఆస్కార్ అవార్డులలో ఇండియన్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం చరిత్ర సృష్టించింది. ఇండియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ తో పాటు 'ది ఎలిఫెంట్ విస్ఫర్స్' ఆస్కార్ ఫైనల్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో 'ది ఎలిఫెంట్ విస్ఫర్స్' చరిత్ర సృష్టిస్తూ మొదటి ఆస్కార్ ని ఇండియాకి అందించింది.