పాకిస్తాన్‌లోని హిందూ దేవాలయాన్ని ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ ప్రారంభించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కరక్ జిల్లా తేరి గ్రామంలో వందేళ్ల చరిత్ర కలిగిన హిందూ సన్యాసి శ్రీ పరమ హన్స్ జీ మహారాజ్ చారిత్రాత్మక సమాధి ఉంది. దీపావళి సందర్భంగా సోమవారం అక్కడ నిర్వహించిన వేడుకలకు జస్టిస్ అహ్మద్ హాజరయ్యారు. ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించబడినప్పటికీ, డిసెంబర్ 2020లో స్థానికులు కొందరు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి, నిప్పంటించారు. […]