ఓ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అభం, శుభం తెలియని కొందరు చిన్నారులు ఈ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు కాగా, మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడడంతో ఆ చిన్నారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. […]