ఓ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అభం, శుభం తెలియని కొందరు చిన్నారులు ఈ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు కాగా, మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడడంతో ఆ చిన్నారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలోని గులాబీ బాగ్ ప్రాంతం. ఉదయం 9 గంటల సమయంలో స్కూలుకు వెళ్లే చిన్నారులు చాలా మంది పుట్ పాత్ పై నిల్చున్నారు. ఇదే సమయంలో అటు నుంచి ప్రతాప్ అనే వ్యక్తి వేగంగా కారులో వస్తున్నాడు. ఇక పుట్ పాత్ వద్దకు ఆ డ్రైవర్ నిర్లక్ష్యానికి కారు పుట్ పాత్ పై నిలిచున్న చిన్నారులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు అవ్వగా, మరో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రమాదం జరిగిందని తెలుసుకున్న కారు డ్రైవర్ వెంటనే చిన్నారుల వద్దకు వచ్చాడు. దీంతో స్జానికులు కోపంతో ఆ డ్రైవర్ పై దాడి చేశారు. అనంతరం కొందరు స్థానికులు హుటాహుటిన గాయపడ్డ చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. ఇదంతా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చికిత్స పొందుతున్న ఆ చిన్నారుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ప్రతాప్ ను అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | Delhi: A speeding car hits three children in Gulabi Bagh area this morning, two children received minor injuries while the third is critical but stable and admitted to a hospital: Delhi Police
(Note: Graphic content, CCTV visuals) pic.twitter.com/1HAc4qyqGk
— ANI (@ANI) December 18, 2022