తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతునే ఉన్నాయి. శుక్రవారం(డిసెంబర్ 29)763 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలుబడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 1,365 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో గ్రూప్-1(503), గ్రూప్-2(763), గ్రూప్-4(9,168), పోలీస్ శాఖ(16614- […]