ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి అని వేదమంత్రాల సాక్షిగా ఒక్కటై ఏడడుగులు నడిచారు. ఒకరికొకరు తోడునీడగా నిల్చున్నారు. కష్టసుఖాలను సమానంగా పంచుకున్నారు. మరణంలో కూడా ఈ దంపతుల బంధం వీడిపోలేదు. కడవరకూ భార్యభర్తల అనుబంధానికి నిదర్శనంగా బతికిన ఆ దంపతులను మృత్యువు విడదీయలేకపోయింది. భార్య మరణించిన కొన్ని గంటలకు భర్త కూడా ప్రాణాలు విడిచిన ఘటన హృదయాలను కలచి వేస్తుంది. గంట వ్యవధిలోనే భార్యా, భర్తలు మృతి చెందడం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. […]