ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారు నందమూరి కుటుంబ సభ్యులు. తెలుగు చిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. చరిత్ర సృష్టించాలన్నా.. ఆ చరిత్రను తిరగరాయాలన్నా కేవలం ఎన్టీఆర్ వలనే అవుతుంది అంటారు. ప్రజలకి చేరువ కావాలనుకునే ప్రతివాళ్లూ కాలానికి, పార్టీలకి అతీతంగా ఎన్టీఆర్‌నే అనుకరించాల్సి వస్తోంది. కృషి ఉంటే మనుషులు రుషులైనట్టు. తెరమీది కథానాయకుడు ప్రజాజీవితంలో మహానాయకుడవుతాడు. వెండి తెరమీంచి ప్రజల గుండెల్లోకి, అక్కడి నుంచి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి సిసలైన నాయకుడిగా పేరు […]