ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారు నందమూరి కుటుంబ సభ్యులు. తెలుగు చిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. చరిత్ర సృష్టించాలన్నా.. ఆ చరిత్రను తిరగరాయాలన్నా కేవలం ఎన్టీఆర్ వలనే అవుతుంది అంటారు. ప్రజలకి చేరువ కావాలనుకునే ప్రతివాళ్లూ కాలానికి, పార్టీలకి అతీతంగా ఎన్టీఆర్‌నే అనుకరించాల్సి వస్తోంది. కృషి ఉంటే మనుషులు రుషులైనట్టు. తెరమీది కథానాయకుడు ప్రజాజీవితంలో మహానాయకుడవుతాడు. వెండి తెరమీంచి ప్రజల గుండెల్లోకి, అక్కడి నుంచి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి సిసలైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. అప్పటికీ ఇప్పటికీ రాజకీయరంగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా కళామ్మ తల్లికి, ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఎన్టీఆర్ 1996, జనవరి 18 న కన్నుమూశారు. ఇక తాత ఎన్టీఆర్ పోలికలను పుణికిపుచ్చుకుని పుట్టిన జూ. ఎన్టీఆర్ కూడా ఆయనలానే స్టార్ గా ఎదిగి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.
నటన, డైలాగ్స్ లో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు జూ.ఎన్టీఆర్. నేడు తాత వర్ధంతి సందర్భంగా తారక్ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశాడు. ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేస్తూ ‘తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధ్రువ తార మీరే’ అంటూ రాసుకొచ్చాడు. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సైతం తాతను గుర్తుచేసుకొని ‘జోహార్ ఎన్టీఆర్’అంటూ ట్వీట్ చేశారు.
తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధ్రువ తార మీరే 🙏🏻 pic.twitter.com/msOmHdOtvl
— Jr NTR (@tarak9999) January 18, 2022
జోహార్ NTR 🙏🏽🙏🏽 pic.twitter.com/VsnBBbyfU9
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 18, 2022