సిద్దిపేట- తెలంగాణ ప్రభుత్వం రైైతులకు తీపి కబురు చెప్పింది. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తామని ఆర్ఖిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సిద్దిపేట కలెక్టరేట్ లో మంత్రి హరీష్ రావు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతులకు డబ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ 26 వేల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉంచారని హరీశ్ రావు చెప్పారు. […]