ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల విషయంలో రోజు రోజుకు ముందుకు వెళుతోంది. ఏటా దాదాపు 45 వేల కోట్ల రూపాయల కొత్త అప్పులు చేస్తోంది. ఈ విషయాన్ని రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం బయట పెట్టింది. రాజ్యసభలో ఏపీ అప్పుల గురించి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఓ ప్రశ్న వేయగా.. దానికి కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో 2,64,451 కోట్ల రూపాయల అప్పు చేసిందని, 2020లో అది 3,07,671 […]