ఆడవాళ్లు అలంకార ప్రియులు. ఏ పండుగైనా, వేడుకైనా ముందు చూసుకునేదీ చీరలతో పాటు నగలే. బంగారం నగలు వేసేందుకు ఆసక్తి చూపుతారు. ఇవి అందంతో పాటు అవసరానికి ఉపయోగపడుతుండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఈ ఆసక్తినే దుకాణాదారులు క్యాష్ చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు.
చిత్తూరు క్రైం– బంగారం.. ఈ పేరు వింటేనే మహిళల మొహాల్లో వెలుగు వస్తుంది. బంగారం అంటే మక్కువ చూపని వారుంటారా చెప్పండి. అందులోను మన దేశంలో బంగారం సంప్రయాంలో భాగమని చెప్పవచ్చు. పైగా బంగారం అతి ఖరీదైన లోహం. దీంతో బంగారానికి అంత విలువ ఇస్తారు అంతా. ఐతే బంగారం కొనుగోళ్లలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మోసపోవడం ఖాయం. తక్కువ ధరకే బంగారం అమ్ముతామని కేటుగాళ్లు చాలా మందిని మోసం చేసిన ఎన్నో ఘటనలను మనం […]