ఏపీలో అసనీ తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీకాకుళం జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సంతబొమ్మాళి మండలం, ఎం సున్నాపల్లి సముద్రతీరానికి ఒక రథం కొట్టుకువచ్చింది. బంగారు వర్ణం కలిగిన రథం అక్కడి ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. ఆ రథాన్ని అక్కడ ఉన్న కొంత మంది తాళ్ళతో కొట్టి ఒడ్డుకు లాగుతూ వచ్చారు. తీరంలో బంగారు వర్ణం రథం గురించి తెలియగానే అదో పెద్ద వింత వస్తువులా స్థానికులు వీక్షించేందుకు భారీ సంఖ్యలో సున్నాపల్లి రేవుకు చేరుకున్నారు. […]