హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలందించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. అందులో భాగంగానే తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పరిధిలో నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మించనున్నది. ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్ లలో 2,679 కోట్ల వ్యయంతో ఆస్పత్రులను నిర్మించేందుకు వైద్య ఆరోగ్య శాఖ పరిపాలనాపరమైన ఉత్తర్వులను గురువారం జారీ చేసింది. 900 కోట్లతో ఎల్బీ నగర్, 882 కోట్లతో […]