కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు కష్టాలు మొదలయ్యాయని.. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మోదీ పాలనతో సామాన్యులు వంటింటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారని సిలిండర్లపై రూ.లక్ష కోట్ల సబ్సిడీ ఎత్తి వేశారన్నారు. మోదీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి దాటింది. గ్యాస్ సిలిండర్‌ఫై రాయితే ఎత్తివేయడమే అధిక ధరకు కారణం అన్నారు. ఎక్కడో జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి.. ధరలు పెంచడం ఎక్కడైనా […]