Gannavaram Airport: గన్నవరం విమానాశ్రయం దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్నారు. ఒకే సారి ఇద్దరూ గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానుండటంతో ఏం జరుగుతుందా? అన్న ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి వెళ్లారు. నాలుగో ఏడాది, రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. […]