Gannavaram Airport: గన్నవరం విమానాశ్రయం దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్నారు. ఒకే సారి ఇద్దరూ గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానుండటంతో ఏం జరుగుతుందా? అన్న ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి వెళ్లారు. నాలుగో ఏడాది, రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం జగన్ గన్నవరానికి తిరుగుప్రయాణం అయ్యారు.
ఇదే సమయంలో పవన్ కల్యాణ్ వైజాగ్‌నుంచి విజయవాడకు వస్తున్నారు. మరికొద్ది సేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగానే గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను పవన్ కల్యాణ్ కలవనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, పవన్ కల్యాణ్ గవర్నర్ అపాయింట్‌మెంట్‌పై ఎలాంటి స్పష్టత రాలేదు. ఇక, సీఎం జగన్ రాక నేపథ్యంలో పోలీసులు గన్నవరం విమానాశ్రయం దగ్గర ఆంక్షలు విధించారు. ఎయిర్ పోర్టు దగ్గరకు జనసేన కార్యకర్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి: CM Jagan: వరుసగా నాలుగో ఏడాది రైతు భరోసా సాయం.. రైతుల ఖాతాలో రూ.2 వేల కోట్లు జమ!