హైదరాబాద్- సాధారణంగా ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఐతే కొన్ని అనివార్య కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు ఎప్పుడైనా జరగవచ్చు. అదే ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే మరింత డేంజర్. సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. హాస్పిటల్ లోని నాలుగో అంతస్తులో ఉన్న లేబర్ డిపార్ట్ మెంట్ విద్యుత్ బోర్డులో షార్ట్ సర్య్కూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆస్పత్రిలో దట్టమైన పొగ వ్యాపించడంతో రోగులు ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక […]