గత కొంత కాలంగా టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. మెగా టోర్నీలు గెలుచుకోలేక పోయినప్పటికీ వరుసగా బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ లపై సిరీస్ లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే ధోనిలా రోహిత్ శర్మ కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని కొందరు మాజీలు ఇటీవల సూచనలు చేశారు. దాంతో రోహిత్ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టగల అర్హులపై తాజాగా చర్చనడుస్తోంది. ఇప్పటికే టీ20లకు పాండ్యాను కెప్టెన్ […]