గత కొంత కాలంగా టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. మెగా టోర్నీలు గెలుచుకోలేక పోయినప్పటికీ వరుసగా బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ లపై సిరీస్ లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే ధోనిలా రోహిత్ శర్మ కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని కొందరు మాజీలు ఇటీవల సూచనలు చేశారు. దాంతో రోహిత్ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టగల అర్హులపై తాజాగా చర్చనడుస్తోంది. ఇప్పటికే టీ20లకు పాండ్యాను కెప్టెన్ గా కొనసాగిస్తున్నప్పటికీ, భవిష్యత్ లో కెప్టెన్ కు అర్హులు కాగల ఇద్దరి పేర్లను ప్రస్తావించాడు టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. తదుపరి టీమిండియా కెప్టెన్ ఎవరు? అనేదే ప్రస్తుతం సగటు భారతీయ క్రికెట్ అభిమాని మనసులో మెదులుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కేఎల్ రాహుల్, పాండ్యా, శ్రేయస్ అయ్యర్, పంత్ లతో పాటుగా మరికొందరి పేర్లు కూడా సారథి జాబితాలో ఉన్నాయి. అయితే జాబితాలో ఎందరి పేర్లున్నా గానీ టీమిండియా భవిష్యత్ కెప్టెన్లు గా సుదీర్ఘ కాలం సేవలు అందించగల ఆటగాళ్లు శుభ్ మన్ గిల్, రిషభ్ పంత్ లు అని భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలోనే ఒక వ్యక్తి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరించడం ఇక ముందు జరగదు అని చోప్రా చెప్పుకొచ్చాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ తర్వాత రోహిత్ సారథిగా కొనసాగే అవకాశాలు లేవని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇక ప్రస్తుతం టీ20 లకు పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ కు కూడా పాండ్యానే సారథిగా వ్యవహరిస్తాడని చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే సుదీర్ఘ కాలం టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించే లక్షణాలు రిషభ్ పంత్, శుభ్ మన్ గిల్ లో పుష్కలంగా ఉన్నాయని, భారత భవిష్యత్ కెప్టెన్లు వారేనని ఈ సందర్బంగా ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. మరి ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Agree with Aakash Chopra?🤔#INDvNZ #RishabhPant #ShubmanGill #Cricket #CricTracker pic.twitter.com/9MqhcbO4gx
— CricTracker (@Cricketracker) January 29, 2023