కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అలాగే లాక్‌డౌన్ కూడా విధిస్తున్నాయి. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలో అతిథులు హాజరయ్యేందుకు అనుమతిస్తున్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 5,065 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.4 లక్షలు దాటింది. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో కరోనాతో 7,227 మంది మృతిచెందారు. […]