ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీలో విషాదం నెలకొంది. నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇవాళ నెల్లూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా, శ్రీధర్ కృష్ణారెడ్డి గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీధర్ కృష్ణారెడ్డి గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో నెల్లూరు జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్ గానూ, నెల్లూరు సిటీ తెలుగుయువత ప్రెసిడెంట్ గానూ వ్యవహరించారు. […]