ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీలో విషాదం నెలకొంది. నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇవాళ నెల్లూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా, శ్రీధర్ కృష్ణారెడ్డి గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీధర్ కృష్ణారెడ్డి గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో నెల్లూరు జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్ గానూ, నెల్లూరు సిటీ తెలుగుయువత ప్రెసిడెంట్ గానూ వ్యవహరించారు.
అయితే 2009 సంవత్సరంలో అనిల్ కుమార్ యాదవ్ పై 90 ఓట్ల మెజారిటీతో ముంగమూరు శ్రీధర్కృష్ణారెడ్డి గెలుపొందారు. అయితే 2014 సంవత్సరం లో టిడిపిలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ 2014 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ పై 19 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇది చదవండి : ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోన్న అనాథ యువతి విజయ ప్రస్థానం
కృష్ణారెడ్డి మృతిపై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. తాము ఆయనను శ్రీధరన్నగా పిలుచుకుంటామని, ఆయన హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆయన మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపాన్ని తెలిపారు.