కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పోయినట్లే పోయిన మహమ్మారి మరోసారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి. కోట్ల మందికి సోకి లక్షల మంది ప్రాణాలను బలికొంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండో దశలో కోవిడ్ మహమ్మారి ప్రభావం టాలీవుడ్‌పై తీవ్రంగా ఉంది. కనీసం ప్రతీరోజూ ఒక సెలబ్రిటీ అయినా కరోనా బారినా పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. […]
కరోనా వేళ వైరస్ సంక్రమించిన వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. హోం ఐసోలేషన్‌లో ఉండే వారు తిండికి సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటోంది. ఇక కుటుంబంలో అందరూ కొవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉంటే వారి తిప్పలు వర్ణనాతీతం. భోజనం చేసుకోలేక సతమతమవుతుంటారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర పోలీసులు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా సోకి హోం ఐసో లేషన్‌లో ఉన్న వ్యక్తుల ఇంటి వద్దకే ఆహారం ఉచిత […]
కరోనా విపత్తు నేపథ్యంలో తమ వంతుగా మానవతా దృక్పథంతో సహాయం అందించాలని నిర్ణయించింది తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్. ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న మరణాలు, స్మశానాల్లో కరోనా మృతుల దహనానికి కట్టెల కొరత తీవ్రంగా ఉందన్న వార్తల నేపథ్యంలో ఫారెస్ట్ కార్పోరేషన్ స్పందించింది. తమ పరిధిలో ఉన్న సుమారు వెయ్యి టన్నుల కలపను ఉచితంగా సరఫరా చేస్తామని అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ఫారెస్ట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున […]
ప్రస్తుతం అనేక మంది కొవిడ్ రోగులు వైద్యసాయం కోసం సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. దీంతో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తన సోషల్ మీడియా ఖాతాలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని తన ఖాతా ద్వారా పోస్ట్ చేసేందుకు అనుమతించారు. ఆస్పత్రులకు పడకలు అందించటంతో పాటు, కొన్ని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించి ఆదుకున్నారు జాన్ అబ్రహం. అలియా భట్ సామాజిక మాధ్యమాల ద్వారా కరోనా బాధితులకు సాయం చేస్తున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ […]