ఈ మధ్యకాలంలో కొన్ని ఆసుపత్రుల్లోని సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అనేక ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే వారిని డబ్బుల కోసం పీడిస్తుంటారు. ఇస్తే సరి లేకుంటే నానా ఇబ్బందులు పెడతారు. తాజాగా ఓ నర్స్ .. కాన్పు చేసినందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో బాలింతకు లేని ఎయిడ్స్ వ్యాధిని అంటకట్టింది. దీంతో అపార్థం చేసుకున్న బాలింత భర్త.. పసికందు, భార్య తనకు వద్దంటూ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు.ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. స్థానికులు […]