ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ తో పాటు ఆ దేశం పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడంతో దేశప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఆఫ్ఘాన్ ప్రభుత్వంలో భాగమైన తమని తాలిబన్లు ప్రాణాలతో ఉండనివ్వరని భయపడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి మహిళా మేయర్ ”జరీఫా గఫారీ” తాలిబన్లు తనని కచ్చితంగా చంపేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు. తాలిబన్లతో పోరాడలేక ఆఫ్ఘన్ సైన్యం చేతులెత్తేసింది. 200కు పైగా విమానాలు, హెలికాప్టర్లు తాలిబన్ల […]