ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ తో పాటు ఆ దేశం పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడంతో దేశప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఆఫ్ఘాన్ ప్రభుత్వంలో భాగమైన తమని తాలిబన్లు ప్రాణాలతో ఉండనివ్వరని భయపడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి మహిళా మేయర్ ”జరీఫా గఫారీ” తాలిబన్లు తనని కచ్చితంగా చంపేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు. తాలిబన్లతో పోరాడలేక ఆఫ్ఘన్ సైన్యం చేతులెత్తేసింది. 200కు పైగా విమానాలు, హెలికాప్టర్లు తాలిబన్ల వశమయ్యాయి.కేవలం ఏకే 47 తుపాకులు, రాకెట్ లాంచర్లతోనే ఆఫ్ఘనిస్థాన్ ను గజగజ లాడించిన చరిత్ర తాలిబన్లది. ఇప్పుడు కూడా కేవలం ఈ ఆయుధాలతోనే ఆఫ్ఘన్ ను వారు చేజిక్కించుకున్నారు. తాలిబన్లతో పోరాడలేక ఆఫ్ఘనిస్థాన్ సైనికులు ఆయుధాలను వదిలేసి పలాయనం చిత్తగించారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తాలిబన్ల సొంతమయ్యాయి.
గత 20 ఏళ్లలో దాదాపు 89 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులను, 11 వైమానిక స్థావరాలను ఆఫ్ఘనిస్థాన్ కు అమెరికా సమకూర్చింది. ఇవన్నీ ఇప్పుడు తాలిబన్ల వశమయ్యాయి. వీటిని ఉపయోగించడంలో ఆప్ఘన్ సైనికులకు అమెరికా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినప్పటికీ తాలిబన్లతో పోరాడలేక వారు పారిపోయారు. దాంతో గత రెండు దశాబ్దాలుగా అమెరికా చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది.
మెత్తం మీద 211 విమానాలు, హెలికాప్టర్లకు గాను 167 పనిచేసే స్థితిలో ఉన్నాయి. అయితే, వీటిని ఎలా ఉపయోగించాలనే విషయంలో తాలిబన్లకు అవగాహన లేదు. వీటికి పైలట్లు, టెక్నీషియన్లను గుర్తించడం తాలిబన్లకు కఠినమైన పరీక్షే. అంతేకాదు వీటి విడిభాగాలను సేకరించడం కూడా చాలా కష్టమైన పనే. ఈ కష్టాలను అధిగమిస్తే మాత్రం తాలిబన్లకు ఒక అత్యాధునికమైన వైమానిక దళం ఉన్నట్టే.
తొలి మహిళా మేయర్ ”జరీఫా గఫారీ” – ట్వీట్:
⚡️ “Afghanistan’s first female mayor: ‘I’m waiting for Taliban to come for people like me and kill me’” by @theipaper https://t.co/mjYmujmxJd
— i newspaper (@theipaper) August 16, 2021