వేసవి వచ్చిందంటే చాలు మామిడి సందడి మొదలవుతుంది. ధనిక, పేద తేడా లేకుండా అందరు తినే పండ్లు మామిడి. నగరంలో ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తూ ఉంటాయి. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఈసారి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గతేడాదితో పోలిస్తే పండు పరిమాణం కూడా పెద్దగా ఉండడం కలిసి వచ్చింది. ‘నూర్జహాన్’ మామిడి ఒక్కోటి ఈ సీజన్‌లో రూ. 500 నుంచి రూ. 1000 పలుకుతోందని వాటిని పండించిన రైతు తెలిపాడు. […]