అంతవరకు ఎంతో సంతోషంగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏదో శాపం తగిలినట్లు ఓ వింత వ్యాధి ఆ కుటుంబాన్ని ఆవరించింది. నెల రోజుల వ్యవధిలో ముగ్గుర్ని బలితీసుకుంది. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా గంగాధరకు చెందిన వేముల శ్రీకాంత్‌ది అందమైన కుటుంబం. భార్య మమత, కూతురు అమూల్య, కుమారుడు అద్వైత్‌తో చిన్న కుటుంబం చింత లేని కుటుంబంలా వాగు ఒడ్డున ఉన్న ఇంట్లో హాయిగా జీవించేవాడు. […]