ఏపీలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన నకిలీ చలాన్లపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం నకిలీ చలాన్ల అంశంపై స్పందించారు. నకిలీ చలాన్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రూ.40 లక్షలు రికవరీ చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప వ్యవహారం వెలుగులోకి రాలేదని సీఎం జగన్ […]