అనుకున్నదే అయ్యింది. ఊహించిందే జరిగింది. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ పర్యటన తరువాత హైదరాబాద్ చేరుకున్న ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామా విషయాన్ని తెలియచేశారు. కాగా.., ఈ సమయంలో ఆయన తనని మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేసిన విధానంపై ఎమోషనల్ గా స్పందించారు. తెలంగాణ ఆత్మగౌరవం అన్న నినాదంతోనే ఇన్నాళ్లు పోరాటం చేశాను, రాజకీయాలు […]
రాజకీయాల్లో ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిలు ఏర్పడుతాయో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ఇక్కడ శాశ్విత శత్రువులు, శాశ్విత మిత్రులు అంటూ ఎవ్వరూ ఉండరు. ఆయా పరిస్థితిలు మాత్రమే నేతలను నడిపిస్తూ ఉంటాయి. కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య వార్ ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. కొన్నేళ్ల పాటు ఉద్యమంలో అన్నదమ్ములలా తిరిగారు వీరిద్దరూ. కలసి అధికారాన్ని కూడా పంచుకున్నారు. అలాంటి వీరి మధ్య ఇంత గ్యాప్ వస్తుందని ఎవ్వరూ ఉహించి ఉండరు. కానీ.., వరుసగా జరుగుతూ వస్తున్న […]