ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి ప్రజలు మధ్య వారధిలా ఉంది. ఈ వ్యవస్థ ద్వారా అనేక ప్రభుత్వ పథకాలను ప్రజలు అందేలా వాలంటీర్లు పనిచేస్తున్నారు. నెలనెల ప్రతి ఇంటికి వెళ్తూ..వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు అందజేస్తూ.. వాలంటీర్లు జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే కొందరు వాలంటీర్లు మాత్రం అడ్డదారులు తొక్కుతున్నట్లు, అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా నెల […]