ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి ప్రజలు మధ్య వారధిలా ఉంది. ఈ వ్యవస్థ ద్వారా అనేక ప్రభుత్వ పథకాలను ప్రజలు అందేలా వాలంటీర్లు పనిచేస్తున్నారు. నెలనెల ప్రతి ఇంటికి వెళ్తూ..వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు అందజేస్తూ.. వాలంటీర్లు జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే కొందరు వాలంటీర్లు మాత్రం అడ్డదారులు తొక్కుతున్నట్లు, అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా నెల పింఛన్ కోసం ఎదురు చూస్తున్న జనానికి ఓ వాలంటీర్ షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చాడు. పింఛన్ డబ్బులతో సదరు వాలంటీర్ ఉడాయించాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
స్థానికుల సమాచారం ప్రకారం.. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో రవి అనే వ్యక్తి గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. ప్రతి నెలలాగానే.. ఈ నెల పింఛన్ కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. పింఛన్ లబ్ధిదారులు అతని కోసం ఎదురు చూశారు. మరుసటి రోజు కూడా అలానే ఎదురు చూశారు. కానీ ఎంతకి వాలంటీర్ తమ వద్దకు రాకపోవడంతో అధికారులను అడిగారు. దీంతో అసలు విషయం బయటపడింది. వాలంటీర్ రవి పింఛన్ డబ్బులు తీసుకుని ప్రియురాలితో పరారయ్యాడు. ఈ విషయాన్ని అతడి తండ్రికి గ్రామస్తులు, అధికారులు తెలిపారు. కుమారుడు తీసుకెళ్లిన మేర డబ్బులను సచివాలయా అధికారులు వాలంటీర్ తండ్రి ఇచ్చాడు. వాటితో గ్రామంలోని లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది పంపిణీ చేశారు. కానీ డబ్బులు ఎంత అనేది తెలియరాలేదు. ఈ ఘటనతో వాలంటీర్ పై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.