సినీ ఇండస్ట్రీలో తెరవెనుక కష్టాలు లేకుండా స్టార్స్ అయినవారు ఎవరూ లేరు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఎల్లప్పుడూ ఏదొక వార్త, పుకారు వినిపిస్తూనే ఉంటుంది. కెరీర్ లో ఎదుర్కొన్న ఆటుపోట్లను ఈ మధ్యే ధైర్యంగా బయట పెడుతున్నారు నటీమణులు. ‘ఓవైపు కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద సమస్యగా ఉంటే.. మరోవైపు లావుగా ఉన్నావ్, మరీ సన్నగా ఉన్నావ్ అంటూ అవకాశాలు చేజారిపోయేవి’ అంటోంది యువనటి ఎరికా ఫెర్నాండేజ్. ఈ హీరోయిన్ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ తెలుగులో […]