ఈ ఏడాది అనేక మంది ఎంసెట్ పరీక్షలు రాశారు. ఇంజనీరింగ్, వైద్య, ఫార్మసీ చదవాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఎంసెట్‌కు 3,20,683 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,01,789 మంది పరీక్ష రాసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇంటర్, ఎంసెట్ రాసే విద్యార్థులకు శుభవార్త. సబ్జెక్ట్ లో తక్కువ స్కోర్ వచ్చి, ఎంసెట్ లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్ధులకు శాపంగా మారిన వెయిటేజ్ ను ఈ ఏడాది కూడా లెక్కించనున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.