రాష్ట్రంలోని రెండు థర్మల్ పవర్ ప్లాంట్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో లోడ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫాల వారీగా విద్యుత్తు సరఫరాకు కోత పెట్టారు. ప్రతి గ్రామానికి కనీసం 1-2 గంటల పాటు రొటేసన్ పద్దతిలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పాటు పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకూ కోతలు విధించారు. దీని గురించి జనాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ గగ్గోలు పెడుతున్నారు. […]