డ్రై ఫ్రూట్స్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకున్నా ప్రాణం కంటే ఎక్కువ కాదు గనుక దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా వాడుతున్నారు. దీంతో డ్రై ఫ్రూట్స్ వ్యాపారాలు మాత్రం ఇంతకు ముందెన్నడూ కనివినీ ఎరుగని స్థాయిలో జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇందులో ప్రధానంగా జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్ష, ఎండు, పండు ఖర్జూరాలు, వాల్‌నట్స్, దోస, పుచ్చ గింజలు తదితరాలు విక్రయిస్తున్నారు. ఇవి తింటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని, కరోనా వచ్చినా ధీటుగా ఎదుర్కొవచ్చని ప్రజల్లో నమ్మకం […]